ఓ భూగ్రహ జీవితమా! నీకు వందనాలు!

 

భూగ్రహం మీది జీవితం
అపసవ్యమైన పరిస్థితులనూ .. భయంకరమైన
పరిస్థితులనూ
బాధాకరమైన పరిస్థితులనూ .. కష్టసాధ్యమైన 
పరిస్థితులనూ
దీనమైన పరిస్థితులనూ .. హీనమైన పరిస్థితులనూ 
కల్పిస్తూ ..
అందులో సాధుసన్యాసులకూ .. సంసారులకూ .. 
పుణ్యాత్ములకూ .. మరి పాపాత్ములకూ
అందరికీ సరిసమానంగా 
అవమానం, అనైక్యత, ఓటమి, ఒంటరితనం,
వెలివేయబడటం, నిరాశ, నిస్పృహ
మొదలైన చేదు అనుభవాలు అందిస్తూ ఉంటుంది.
అందుకే జీసస్ క్రైస్ట్ కూడా …
“ఓ తండ్రి/దేవుడా! ఎందుకయ్యా నన్ను విడిచిపెట్టావు?!” ..
“ఎందుకయ్యా నన్ను విడిచిపెట్టాల్సి వచ్చింది?!” 
అంటూ మొరపెట్టుకున్నాడు!!
అయితే భూగ్రహం మీది జీవితం ..
సవ్యమైన పరిస్థితులనూ .. ఉల్లాసకరమైన 
పరిస్థితులనూ ..
సుసాధ్యమైన పరిస్థితులనూ .. అద్భుతమైన
పరిస్థితులనూ కూడా కల్పిస్తూ ..
అందులో సాధు సన్యాసులకూ .. సంసారులకూ ..
పుణ్యాత్ములకూ .. మరి పాపాత్ములకూ
అందరికీ సమానంగా
మానం, విజయం, సహకారతత్వం, సంతోషం, 
మెచ్చుకోలు పొందటం, బృందచైతన్యం
మొదలైన తీపి అనుభవాలు కూడా అందిస్తూ
ఉంటుంది.
ఓ భూగ్రహమా! నీకు వందనాలు!!
ఓ భూగ్రహ జీవితమా! నీకు కృతజ్ఞతలు!!