నోటిలో ‘శనిదేవుడు’

 

మనం అంతా దేవుళ్ళం
మనమంతా దివ్యలోకాలనుంచి 
భువికి దిగివచ్చిన దేవుళ్ళం
దివ్యలోకాలలో ఉన్నప్పుడు దివ్యలోకవాసులం
భువిలో ఉన్నప్పుడు భూలోకవాసులం

***

దివ్యలోకాలలో ఉన్నప్పుడు భూలోకం ” పరలోకం ” అవుతుంది
భువిలో ఉన్నప్పుడు దివ్యలోకాలు ” పరలోకాలు ” అనబడుతాయి
జననం ద్వారా భూలోకం అనబడే పాఠశాలకు పయనం
మరణం ద్వారా దివ్యలోకాలకు తిరుగు ప్రయాణం
భూలోకవాసులు ఆత్మజ్ఞానం ద్వారా మాత్రమే పై సత్యాలను దర్శిస్తారు ..
దర్శించి ఆనందంతో జీవిస్తారు .. ఆయురారోగ్యాలతో విరాజిల్లుతారు ..
చిరంజీవులుగా కూడానూ కొందరు వుంటారు

***

దిగివచ్చిన దేవుళ్ళందరూ సృష్టికి విశిష్ఠ అల్లుళ్ళే!
ప్రకృతి మాత అల్లుళ్ళందరినీ ఆశీర్వదిస్తుంది!
ప్రకృతి కాంత దిగివచ్చిన దేవుళ్ళందరికీ సర్వం సమర్పిస్తుంది
ప్రకృతి కాంత ప్రకృతి పురుషుడితో సమాగమం చెందవలె కదా 
అయితే,
కొందరి అల్లుళ్ళ నోర్లలో శనిదేవుడు !
దాంతో అంతా రసాభాస .. అంతా అస్తవ్యస్తం
అంతా దుఃఖం .. అంతా అంధకారం
భోగం పాళ్ళు బహు తక్కువ .. రోగం పాళ్ళు బహు ఎక్కువ

***

ఆత్మజ్ఞానం లేనందువల్లే అల్లుడినోట్లో మరి  “శనిదేవుడు” 
నోట్లో శనిదేవుడు ఉండడం బట్టే ఆత్మజ్ఞానం మరి లేకపోవటం
చెట్టు ముందా?! విత్తు ముందా?!
ఎటునుంచి ఎటువైపు అయినా నరుక్కు రావచ్చు
నోట్లో శనిదేవుడు పోతే ఇక అంతా నందనవనమే
ఇక భూలోకం దివ్యలోకమే .. ఇక భూతలం స్వర్గతుల్యమే
ఇంతకూ ” నోట్లో శని ” అంటే??
తినకూడనివి తినడమే ” నోట్లో శని ” అంటే !
మాట్లాడకూడనివి మాట్లాడితే మరి అదే ” నోట్లో శని ” అంటే !
మాంసాహారం అన్నది దిగివచ్చిన దేవుళ్ళను జంతుజాతి మృగాలుగా తయారుచేస్తుంది
మాంసాహారం = 50% శనిదేవుడు
ఇకపోతే వాక్కులలో అనాగరికత
వాణిలో దరిద్రత .. వాణిలో అసభ్యత
వాణిలో అశాస్త్రీయత .. వాణిలో అనాధ్యాత్మికత

***

ఇదంతా వెరసి మరొక “50% శాతం శనిదేవుడు”
ఈ విధంగా 100% శనిదేవుడు అల్లుడినోట్లో శని వుంటే అల్లుడికి ఇక భోగం ఎక్కడిది?
సృష్టిమాతకు అల్లుడిగా వున్నా ఏం లాభం ? భోగించలేడు కదా!
వాణిలో అతి సర్వత్ర వర్జయేత్
వాణిలో అశుద్ధత సర్వత్ర వర్జయేత్
వాణిలో అశాస్త్రీయత సర్వత్ర వర్జయేత్
వాణిలో అనాధ్యాత్మికత సర్వత్ర వర్జయేత్
సంపూర్ణంగా శాకాహారులమైనప్పుడు, శుద్ధ శాకాహారులమైనప్పుడు
అల్లుడినోట్లో ” శనిదేవుడు ” సగం మాయమైనట్లు
ఆ తరువాత వాణి శుద్ధమైనప్పుడు .. వాక్కులు ఆధ్యాత్మికమయమైనప్పుడు
మిగతా అర్థభాగం ” శనిదేవుడు ” పూర్తిగా అదృశ్యం చెందుతాడు
అల్లుడి నోట్లో ” శనిదేవుడు ” లేకపోతే ఇక అంతా వీర భోగమే..
ఇక అంతా క్షణక్షణ ఆనందమే ..
ఇక అంతా నిత్యకల్యాణం పచ్చతోరణమే ..

***

మానవులందరి నోర్లలో శనిదేవుడు పూర్ణంగా అదృశ్యమయ్యే యుగం
మనం ఇక అతి తొందరలో దర్శించబోతున్నాం
మానవ జీవితాలలో దరిద్రం, నరకం అన్నవి అప్పుడు నామమాత్రంగా కూడా వుండజాలవు
ఆ నవ్య-దివ్య-భవ్య యుగం కోసమే
పిరమిడ్ మాస్టర్లు ఎంతో కష్టపడ్డారు – ఎంతో కష్టపడుతూన్నారు
ఇంకొన్ని సంవత్సరాలు కూడా మరి కష్టపడవలసిందే

***

ధ్యాన, స్వాధ్యాయ, సజ్జన సాంగత్యాల ద్వారా మాత్రమే
“శనిదేవుడు” మటుమాయం అవుతాడు
NO MORE “శనిదేవుడు” PLEASE ..