నిత్యాగ్నిహోత్రుడు
ఒకానొక బ్రాహ్మణుడికి
“నిత్యాగ్నిహోత్రం ” అన్నది తప్పనిసరి కర్తవ్యం
“బ్రాహ్మణుడు ” అంటే ” బ్రహ్మజ్ఞానం కలిగినవాడు “
“బ్రాహ్మణుడు ” అంటే ” దివ్యచక్షువును సంపాదించుకున్న యోగి “
ఒకానొక పరమగురువు యొక్క కర్తవ్యం ఏమిటి ?
“నిత్యాగ్నిహోత్రం “
“అగ్నిహోత్రం ” అంటే ” అగ్నిని ప్రజ్వలింపచేయడం “
“నిత్యాగ్నిహోత్రుడు ” అంటే
“ఎప్పుడూ అగ్నిని ప్రజ్వలింపచేస్తూ వుండేవాడు ”
జ్ఞాన వెలుతురుని ఇరవై నాలుగు గంటలూ విరజిమ్ముతుండేవాడు
“అగ్ని” అంటే “జ్ఞానాగ్ని”
అంటే “తులసీదళం” లోని మొదటి ఆకు :
“ఉద్ధరేదాత్మనాత్మానం”
“అగ్ని” అంటే “యోగాగ్ని ” కూడా
అంటే “తులసీదళం” లోని రెండవ ఆకు :
“నిరంతర ఆనాపానసతి-విపస్సన యోగసాధన ”
ఒకానొక యోగి, తాను “యోగి ” అయిన తరువాత కూడా
తన సాధనలో నిరంతరంగా నిమగ్నుడై వుంటాడు
తన “దీపం” తగ్గకుండా ఎప్పుడూ చూసుకుంటూ వుంటాడు
అదే సమయంలో ఇతరుల “దీపాలను” కూడా దేదీప్యమానంగా
వెలగించడానికి ఎప్పుడూ కృషి చేస్తూనే ఉంటాడు
* ప్రతి యోగీ నిత్యాగ్నిహోత్రుడే