నిశ్శబ్దం – మౌనం
“మాట” .. వెండి! “మౌనం” .. బంగారం!!
***
PSSM 18 ఆదర్శ సూత్రాలలో ..
మొదటి సూత్రం .. “ధ్యానం”
రెండవ సూత్రం .. “స్వాధ్యాయం”
మూడవ సూత్రం .. “సజ్జన సాంగత్యం”
నాలగవ సూత్రం .. “మౌన అభ్యాసం”
***
నిరంతరం నోటిని అదుపులో ఉంచుకుంటూ ..
అవసరం అనిపించినప్పుడు మాత్రమే మాటను జాగ్రత్తగా వదులుతూ ..
“మౌనాన్ని అభ్యాసం చేయడం” అన్నది ఒక గొప్ప శాస్త్రం!
అదే “Science of Silence!”
“మాట అవసరం లేకుండానే”
99% జీవితాన్ని మనం హాయిగా, ఆనందంగా మరి ఉన్నతంగా జీవించవచ్చు ..
కనుక .. “తప్పనిసరి” అనుకున్నప్పుడే .. నోరు తెరిచి ..
“అవసరం ఉన్నంత మేరకే” ఆధ్యాత్మిక సంభాషణ చేయడం
ఒకానొక బుద్ధుడు అనుసరించవలసిన మధ్యేమార్గం!
***
ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ కూడా “Science of Silence” శాస్త్రాన్ని
నిరంతరం అధ్యయనం చెయ్యాలి .. మౌనఅభ్యాసంతో ప్రయోగాలు చెయ్యాలి!
“అభ్యాసం కోసం విద్య” కనుక “మౌన అభ్యాసం”లో నిష్ణాతులం కావాలి.
“2016 సంవత్సరం” అన్నది పిరమిడ్ మాస్టర్స్ అందరికీ
“మౌనశాస్త్ర అవగాహనా సంవత్సరం”!
“మౌన అభ్యాస సంవత్సరాన్ని” త్రికరణశుద్ధిగా పాటించుదాం ..