నిర్వికల్ప సమాధి
“నిర్” + “వికల్పం” = నిర్వికల్పం
“వికల్పం” = సంశయం
“నిర్వికల్ప” = సంశయాలు లేని
కనుక
“నిర్వికల్పసమాధి “
అంటే
“ఏ మాత్రమూ సంశయాలు లేని స్థితి”
దివ్యచక్షువు సంపూర్ణంగా ఉత్తేజితం అయిన తరువాతి స్థితి
తన “పూర్ణాత్మ” గురించి క్షుణ్ణంగా తెలుసుకున్న స్థితి
పూర్ణాత్మతో .. మిగిలిన ” పరమగురు పరంపర ” తో
అవిచ్ఛిన్న అనుసంధానం కలిగివున్న స్థితి
తన జన్మపరంపర గురించీ
కర్మ పరంపర గురించీ
కర్తవ్యనిష్ట గురించీ సంపూర్ణంగా తెలుసుకున్న స్థితి అన్నమాట
* నిర్వికల్ప సమాధి స్థితి అంటే మహాపరినిర్వాణ స్థితి
సర్వసంశయ రహిత స్థితి
* మనస్సు నిర్వికల్పం అయినప్పుడే తోటి వారికి సత్యమార్గం
చూపించగలం