నిర్ణయాలు

 

ఎవరి దగ్గరకు వెళ్ళినా ఒకటే జవాబు –

రేపు చూద్దాం, రేపు చేద్దాం.

అదీ ఎంతో సేపు అలోచించి అప్పుడు ఇచ్చే జవాబు.

అధముల బ్రతుకులు ఎప్పుడు ఇంతే,

రేపు అనేవాడు అధముడు:

ఇవాళ అనేవాడు మధ్యముడు.

ఇప్పుడు అనేవాడు ఉత్తముడు.

రేపు చూద్దాం, అని చెప్పడానికి ఆలోచించనక్కరలేదు.

ఇప్పుడు ఎలా చేద్దాం? అని తెలుసుకోవడానికే ఆలోచించాలి.

మనిషి అంటేనే నిర్ణయాలు.

నిర్ణయాలు తీసుకోనిదే మనిషి జస్ట్ ఎ మెషీన్.

ఏ మెషిన్ కూడా స్వయంగా నిర్ణయాలు తీసుకోలేదు.

నిర్ణయాలు ఎప్పుడూ వర్తమానం లోనే తీసుకోబడతాయి.

నిర్ణయాలు తీసుకోవడానికి ఆలోచించాలి.

ఆలోచించడానికి ఇష్టపడనివాడే రేపు అంటాడు.

తన ప్రగతి మీద తనకు ఇష్టం లేనివాడే రేపు అంటాడు.

ఎప్పటికప్పుడూ తెలివి గా నిర్ణయాలు పోస్ట్‌పోన్ చేయడాన్నే తమోగుణం అంటాం.

సరియైన ఆలోచన లేకుండా తొందరపడి నిర్ణయాలు తీసుకోవడాన్నే రజోగుణం అంటాం.

సశాస్త్రీయంగా ఆలోచిస్తూ నిర్ణయాలను ఎప్పటికప్పుడు తీసుకోవడాన్నే సత్త్వగుణం అంటాం.

ఇక చివరిగా, ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా వాటి పర్యవసనాల గురించి ఏ మాత్రం చింతించని వాడిని ఎంచక్కా నిర్గుణుడు అంటాం.

మనిషి తనను తాను తెలుసుకోవడం అంటే తన నిర్ణయాల తీరును గ్రహించడం అన్నమాట. తనను తాను తమోగుణి గా గానీ రజోగుణి గా గానీ గ్రహిస్తే, గుర్తిస్తే వెంటనే సాత్వికునిగా మారాలి. ఆ తరువాత నిర్గుణి గా పరిణితి చెందాలి.

పిరమిడ్ ధ్యానులందరూ, పిరమిడ్ మాస్టర్స్ అందరూ, ప్రతి క్షణం సరియైన నిర్ణయాలు తీసుకుంటారు.

రేపు చూద్దాం, రేపు చేద్దాం, అని ససేమిరా అనరు, అనలేరు.

ఎప్పటికప్పుడు మనం తీసుకున్న ఊపిరి ఆఖరి నిర్ణయం కాగలదు.

కనుక ఏ నిర్ణయానికి ఆ నిర్ణయమై ఆఖరి నిర్ణయం కాగలదు

ఆఖరి నిర్ణయమే మరణానంతర జీవితాన్ని నిర్దేశిస్తుంది.

కనుక …

ఎప్పటికప్పుడు నిర్ణయాలు ఖచ్చితంగా, సశాస్త్రీయంగా ఉండాలి.

ఎప్పటికప్పుడు ఖచ్చితంగా, సశాస్త్రీయంగా నిర్ణయాలు తీసుకునే పిరమిడ్ మాస్టర్లందరికీ అభినందనలు.