నిద్రావస్థ
జీవుడికీ, మరి భౌతిక కాయానికీ, ఎంతైనా అవసరం
ఆ స్థితిలో
మనం స్థూలశరీరం వదిలి సూక్ష్మశరీరంతో
ఎన్నో ఇతర లోకాలలో తిరుగుతాం
ఎంతోమందితో కలుస్తాం ..
భూత భవిష్యత్ కాలాలను పరిశీలిస్తాం, పరిశోధిస్తాం
“నిద్రావస్థ” అన్నది కేవలం శరీరానికే కానీ ” ఆత్మ ” కు కాదు
“ఆత్మ” అన్నది నిరంతరమూ ఎరుకతోనే ఉంటుంది
“నిద్రావస్థ” లో మన భౌతిక శరీరం వదిలి సూక్ష్మశరీర అనుభవాలు
పొందిన తరువాత శరీరంలోకి తిరిగి వచ్చినప్పుడు కూడా
కొన్ని అనుభవాలు కొంతైనా,
ఆ జ్ఞాపకాలనే ” స్వప్నాలు ” అని అంటాం
అమూల్యమైన, అత్యవసరమైన నిద్రావస్థలో మనం :
* క్రొత్త విషయాలను తెలుసుకుంటాం
* క్రొత్త శక్తిని సంతరించుకుంటాం
* భౌతిక శరీరానికి అతి అవసరమైన విశ్రాంతిని చేకూరుస్తాం
* భౌతిక జీవితంలోని సమస్యలకు పరిష్కారమార్గాలను సులభంగా తెలుసుకుంటూ ఉంటాం
* భౌతికంగా తీరని కోరికలను కూడా హాయిగా సూక్ష్మలోకాలలో తీర్చుకుంటూ వుంటాం