నష్టో మోహః

 

అర్జునుడు

గీతాబోధ అంతా అయిన తరువాత అంటాడు;

“నష్టో మోహ స్మృతిర్ లబ్ధ్యా త్వత్ప్రసాదాన్ మయాచ్యుత” అంటే,

“అచ్యుతా, నీ దయ ద్వారా నా మోహం నుంచి విముక్తుడయినట్లు ?

అసలు ఏ మోహంతో హతుడయినట్లు ?

అర్జునుడు పురుషోత్తముడు

“ప్రాపంచిక మోహం” అతనిని ఎప్పుడూ అంటలేదు.

ఆ యుద్ధసమయంలో అతనికి “ఆధ్యాత్మిక మోహం”

కేవలం క్షణమాత్రం ‘గ్రహణం’లా పట్టింది

అయితే, గీతాబోధ వలన అది మరుక్షణం విడివడింది అంటే,

మోహాలలో ‘ఆధ్యాత్మిక మోహాలు’ కూడా ఉంటాయన్నమాట.

 

  • అధములకు ప్రాపంచిక మోహం సహజం;అల్పజ్ఞులు దీని నుంచి జాగ్రత్త పడాలి
  • ఉత్తములకు ఆధ్యాత్మిక మోహం ప్రతిబంధకం;విజ్ఞులు దీని నుంచి తమను తాము రక్షించుకోవాలి.