నచికేతుడు

 

అందరూ ‘ప్రజల్పం’ తీసివేయాలి ; ధ్యానం చేసి ఆత్మను అనుభవించాలి.

‘ప్రజల్పం’ తీసివేయాలి; రాక్షసత్వం అంటే హింస; మానవత్వం అంటే మూర్ఖత. మానవులంతా మూర్ఖులు – మాట్లాడవలసింది ‘ఆత్మ’ గురించి, ‘మూడవకన్ను’ గురించి, ‘బుద్ధుడి’ గురించి, ‘సోక్రటీస్’ గురించి, ‘రమణ మహర్షి’ గురించి, ‘పరలోకాల’ గురించి – నచికేతునికి యమధర్మరాజు మూడు వరాలు ఇచ్చాడు. ఒక వరంగా ” నా తండ్రి ఎన్నో పాపాలు చేసాడు, పనికిమాలిన వాటికి దానధర్మాలు చేసాడు. అదంతా తీసివేయండి” అన్నాడు. రెండవదిగా, “దేశంలో అందరూ బాగా ఉండాలి” అని కోరాడు. “మూడవదిగా నీకు ఏదైనా కోరుకో” అని యమధర్మరాజు అడిగితే, “మనిషి చనిపోయాక ఎక్కడికి వెళ్తాడు ఆ విశేషాలు కావాలి” అని అడిగాడు. నచికేతునికి పదకొండు ఏళ్ళు – అలా ఉండాలి అందరూ- ” మనిషి శరీరమా లేక ఆత్మా?” అని అడిగాడు.

పనికొచ్చే మాటలు మాట్లాడటమే దైవత్వం. పనికొచ్చే మాటలు ధ్యానం చేస్తేనే వస్తాయి కనుక ‘పనికొచ్చే ధ్యానం’ చేయండి. ధ్యానం చేసి ఆత్మను అనుభవించినవాడు దేవుడు. అందరి మాటలూ విని మాట్లాడేవాడు పండితుడు మాత్రమే – అది దివ్యత్వం కాదు.