నారదుని సలహా
ఒకానొక సన్నివేశంలో నారదుడు ఈ విధంగా అన్నాడు:
“‘నాకు అనుభవం కాలేదు కనుక అది అవాస్తవం’ అని
ఎప్పుడూ అనవద్దు, ఏదేని విషయాన్ని శాస్త్రపరంగా.
కూలంకషంగా, అధ్యయనం చేస్తేనే వాస్తవం తెలుస్తుంది;
వాస్తవాలు తెలిస్తేనే మరి పరిస్థితులు అవగాహనకు వస్తాయి;
పరిస్థితులు అవగాహనకు వస్తేనే మరి సరియైన నిర్ణయాలు చేయగలం.”
అందుకే,
జీసస్ కూడా అన్నాడు:
“JUDGE YE NOT” అని . .
అంటే,
“ఎప్పుడూ త్వరపడి ఏ నిర్ణయానికీ రావద్దు” అని
- ఏ విషయంలోనైనా నిజమైన అవగాహన అన్నది దివ్యచక్షువుతోనే సాధ్యం
- యోగులే దేని గురించైనా సరియైన విధంగా తీర్పునివ్వగల సమర్థులు
- యోగులు కాని వారు సమయోచిత తీర్పు ఎప్పటికీ చెప్పలేరు.