నాలుగు ఆర్య సత్యాలు

 

బుద్ధుడు నాలుగు అద్భుత సత్యాలను కనుక్కున్నాడు,

అవి:

  • దుఃఖం అంతటా వుంది
  • ఈ దుఃఖం ‘తృష్ణ’ వలన ఏర్పుడుతుంది
  • తృష్ణ ‘అవిద్య’ వలన వస్తుంది
  • అష్టాంగ మార్గమే అవిద్యానాశకారి

అష్టాంగ మార్గాన్ని అవలంబించడమే ఏకైక శరణ్యం

దానివల్ల శాశ్వతమైన దుఃఖ – రాహిత్యం కలుగుతుంది

  • “తృష్ణ” అంటే శృతికి మించిన రాగం.
  • “తృష్ణ” అంటే లయకు మించిన తాళం
  • “తృష్ణ” అంటే మితికి మించిన మోతాదు.

“తృష్ణ” అన్నదే వాస్తవానికి దుఃఖానికి ప్రత్యక్ష కారణం.

“తృష్ణా-రాహిత్యం” వల్లనే దుఃఖ-రాహిత్యం కలుగుతుంది.

దుఃఖ-రాహిత్యమే నిర్వాణం

 

  • “నిర్వాణం” అన్నా, “ముక్తి” అన్నా, “మోక్షం” అన్నా,
    “నిఃశ్రేయస్సు” అన్నా, “అపవర్గం” అన్నా అన్నీ ఒక్కటే, అవన్నీ పర్యాయపదాలే.