ముక్తి – పరిముక్తి – మహాపరిముక్తి

 

ముక్తస్థితులుమూడు,

అవి

1. ముక్తి

2. పరిముక్తి

3. మహాపరిముక్తి

బుద్ధుడుభాషలోఇవే

1. నిర్వాణం

2. పరినిర్వాణం

3. మహాపరినిర్వాణం

“సాధనతో సమకూరు పనులు ధరలోన.” – అన్నాడు వేమన,

ముక్తిసాధనామార్గాలుమూడు

1. సాధన

2. పరిసాధన

3. మహాపరిసాధన

నిర్వాణం పొందిన వారిని ‘అరిహంతులు’అంటాం.

పరినిర్వాణం పొందిన వారిని భోధిసత్వులు’అంటాం.

మహాపరినిర్వాణం పొందిన వారిని బుద్ధుళ్ళు’అంటాం.

‘ధ్యాన సాధన’ ద్వారా ‘ముక్తి’ లభిస్తుంది.

-అంటే, శ్వాసానుసంధానం ద్వారా చిత్తవృత్తి నిరోధం జరిగి ఆత్మానుభవం జరుగుతుంది.

-ఆత్మానుభవమే ప్రాథమిక ముక్తి.

ఇకపోతే, ‘పరిముక్తి’ అన్నది ‘పరిసాధన’ ద్వారా లభిస్తుంది.

‘ధ్యాన సాధన’ అన్నది ‘సాధన’ అయినప్పుడు

‘స్వాధ్యాయ సాధన’ … ‘పరిసాధన’ అవుతుంది.

సృష్టిలోని సకల యోగీశ్వరుల, సకల జగద్గురువుల ధ్యానానుభవాలనూ, జ్ఞానపాఠాలనూ కూలంకషంగా అధ్యయనం చేయడమే స్వాధ్యాయం’అనబడుతుంది.

స్వాధ్యాయ సాధనే పరిసాధన, స్వాధ్యాయం ద్వారానే పరిముక్తి, పరినిర్వాణం.

మూడవ సాధన ‘మహాపరిసాధన’ … దీని ద్వారానే ‘మహాపరిముక్తి’, ‘మహాపరినిర్వాణం’ పొందుతాం … మరి ‘బుద్ధుళ్ళ’మవుతాం.

ఈ మూడవ సాధనే ‘సజ్జన’ సాంగత్య సాధన. మనకన్నా ఉన్నత జ్ఞానస్థితిలో వున్న వారందరి నుంచీ సదా, ముఖతః నేర్చుకోవడం; మనకన్నా అల్పజ్ఞాన స్థాయిలో వున్న వారందరికీ, సదా, ముఖతః జ్ఞానాన్ని బోధించడం – ఇదే ‘సజ్జన సాంగత్య మహాపరిసాధన’ అనబడుతుంది.

-ధ్యానం ద్వారా ముక్తి.

-ధ్యాన, స్వాధ్యాయాల ద్వారా పరిముక్తి.

-ధ్యాన, స్వాధ్యాయ, సజ్జన సాంగత్యాల ద్వారా మహాపరిముక్తి.

స్వంత ముక్తి కోసం పాటుపడినప్పుడు ముక్తి’లభిస్తుంది.

కొంతమంది ఇతరుల ముక్తికి అహర్నిశలూ, పాటుపడినప్పుడు పరిముక్తి’లభిస్తుంది.

సకల ప్రాణికోటి ముక్తికి … అహర్నిశలూ, శ్వాస వున్నంతకాలం … దేహం వున్నంతకాలం … కృషి సల్పితేమహాపరిముక్తి’లభిస్తుంది.

పిరమిడ్ మాస్టర్లందరూ మహాపరిసాధకులు.

పిరమిడ్ మాస్టర్లందరూ మహాపరిముక్తి కాముకులు.

పిరమిడ్ మాస్టర్లందరూ బుద్ధుళ్ళు.