మౌనం యొక్క విలువ
11-11-2013 .. స్థలం బోధన్
సావిత్రీదేవి పిరమిడ్ ధ్యానమందిర ప్రాంగణంలో
పిరమిడ్ మాస్టర్లు సమావేశం అయ్యారు:
పత్రీజీ 66వ జన్మదిన సంబరాలు జరుగుతున్నాయి:
కరీంనగర్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ “K. వాణి ..”
“పత్రీజీ! మేము ఇంకా ముందుకు సాగిపోవాలి అంటే ఇంకా ఏం చెయ్యాలి?”
అని అడిగారు.
మౌన దీక్షలో వున్న పత్రీజీ ఇలా వ్రాసి చూపించారు:
“రోజు కనీసం ఒక గంట ధ్యానం తప్పనిసరిగా చెయ్యాలి ..
రోజు ఓ క్రొత్త పుస్తకం చదవాలి ..
రోజూ మనకు తెలిసింది ఒక్కరికైనా చెప్పాలి ..
రోజూ ఒక గంట మౌనం పాటించాలి ..
రోజూ ఒక గంట చెట్లు, మొక్కలబాగోగులను చూసుకోవాలి ..
రోజూ ఒకక్రొత్త వంట నేర్చుకోవాలి ..
రోజూ ఇంటర్నెట్ ద్వారా
PSSM లో
జరుగుతూన్న కొత్త సంగతులు కొంత తెలుసుకుంటూ వుండాలి ..
రోజూ ఒక ఆధ్యాత్మిక సినిమా చూడాలి ..
రోజూ ఒక గంట ఇంట్లో పనులను సాధిస్తూ వుండాలి ..
రోజూ ఒక పది మంది తెలియని వ్యక్తులను గమనిస్తూ వుండాలి ..
రోజూ ఒక్క భగవద్గీతశ్లోకానైనా ప్రతిపదార్థంతో సహా కంఠస్థం చేయాలి ..”
గోదావరిఖిని సీనియర్ పిరమిడ్ మాస్టర్ “K. అనురాధ గారు”
“మౌనం ఎందుకు? దాని వల్ల లాభం ఏమిటి?” అని అడిగారు ..
పత్రీజీ ఇలా వ్రాసి చూపించారు:
“మౌనం అంటే ఏమిటో తెలుస్తుంది మీకూ, మరి మీ ప్రక్కవారికి కూడా ..
మౌనం యొక్క విలువ తెలుస్తుంది మీకూ, మరి మీ ప్రక్కవారికి కూడా ..
మాట ఎంత జాగ్రత్తగా మాట్లాడాలో తెలుస్తుంది ..
రోజూ ఎంత వ్యర్థంగా మాట్లాడుతున్నామో తెలుస్తుంది ..
టెలిపతి శక్తి ద్విగుణీకృతం అవుతుంది ..
దేహం యొక్క ప్రాణశక్తి విశేషంగా ఆదా అవుతుంది ..
వివేకాన్ని ప్రసాదించే బుద్ధి మరింత వికసిస్తుంది ..
ధ్యానం మరింత ప్రబలమవుతుంది ..
మన మీద మనకు గౌరవం పెరుగుతుంది ..
మరింత ఎక్కువగా పుస్తకపఠనం చేయగలుగుతాం ..
ప్రకృతి యొక్క అందాలు మరింతగా చూడగలగుతాం!”