మౌనదీక్షలో – పత్రీజీ వ్రాతపూర్వక సందేశాలు

“పిరమిడ్ మాస్టర్లకు ..”

 

నో కంప్లయింట్స్! .. నో రిగ్రెట్స్!
సమయాన్ని వృధాచెయ్యరాదు!
పుష్కలంగా విశ్రాంతి పొందాలి!
“విశ్రాంతి” అన్నది
సమయాన్ని వృధా చెయ్యడం ఎంతమాత్రం కాదు
కానీ .. “కంప్లయింట్స్‌తో మరి రిగ్రెట్స్‌తో గడపడం”
అన్నది మాత్రం
సమయాన్ని వృధా చెయ్యడమే అవుతుంది!

***

నా ఆటలు నేను నా కోసం ఆడుకుంటూనే ఉంటాను!
నా పాటలు నేను నా కోసం పాడుకుంటూనే ఉంటాను!
నేను చెయ్యనిది ఒక్కటే .. అది ధ్యానం!
ఎందుకంటే నేను దానిని దాటిపోయాను!
ఈ భూమండలంలో నేను ఉన్నా .. లేకపోయినా 
సత్యం కోసం .. ఆధ్యాత్మికత కోసం ..
పరోపకారం కోసం .. స్వేచ్ఛాతత్త్వం కోసం..
ఎవరి వంతు కర్తవ్యం ఎంత ఉంటుందో ..
అంతగా అందరూ చేస్తూనే ఉండాలి!

***

మీ గురించి మీరు జీవించండి!
అది చెయ్యడానికే మీరు ఇక్కడికి వచ్చారు!
పని చెయ్యాలి అనిపిస్తేనే .. పని చెయ్యండి!
బోధించాలి అనిపిస్తేనే .. బోధించండి!
నిద్రపోవాలి అనిపిస్తేనే .. నిద్రపోండి!
మాట్లాడాలి అనిపిస్తేనే .. మాట్లాడండి!
మాట్లాడాలి అనిపించకపోతే .. మాట్లాడవద్దు!
అయితే “ధ్యానఅభ్యాస అవసరాన్ని అధిగమించాము”
అనిపించేంత వరకూ ధ్యానం చెయ్యాల్సిందే!