మూషికవాహనుడు
“‘వినాయకుడు’ అన్నవాడు
‘మూషిక వాహనుడు’
“‘ఇంత పెద్ద పొట్ట గలవాడు ఇంత చిన్న ఎలుక మీద
ఏ రీతిగా కూర్చోగలడు ?’ అని ..
అనేకమంది విమర్శలు చేస్తూ వచ్చారు
నిజంగా దీని అంతరార్థం తెలియని మూర్ఖులే
ఇలాంటి అనర్థాలను అభివృద్ధి చేసి
యదార్థాలను విస్మరింపచేస్తున్నారు
“‘మూషికం’ అంటే ‘చీకటి’ కి గుర్తు
‘వినాయకుడు’ అన్నవాడు చీకటిని తన క్రింద వేసుకున్నాడన్నామాట
అంటే చీకటిని అణగద్రొక్కాడు”
– శ్రీ సత్యసాయి
(“సనాతన సారధి”, అక్టోబర్ ’94)
* “మూషిక వాహనుడు” అంటే “ఎలుకను ఎక్కినవాడు” అని కాదు ..
“చీకటిని అణగద్రొక్కి జ్ఞానప్రకాశాన్ని అందించినవాడు” అని అర్థం