మెట్ట వేదాంత ఘోష
మెట్ట వేదాంత ఘోష ఇంక మనకు వద్దు
దానివలన ఏమీ వొరగదు
“ద్వైతం” .. “అద్వైతం” .. “విశిష్టాద్వైతం”
అని ఒకటే వెర్రికేకలు .. ఏమిటీ గోల ?
చేయవలసినవి రెండే
మొదటిది: అకుంఠిత ధ్యానయోగసాధన
రెండవది: ఇతర యోగసాధకుల ధ్యానానుభవాలను వారి ముఖతః వినడం
మరి ప్రపంచవ్యాప్తంగా ధ్యానయోగేశ్వరులు వ్రాసిన గ్రంథాలను చదవడం
మతాలలో ‘భేదాలు’ అన్నవి నిజానికి సున్న
“వివిధ మతాలు” అన్నవి అసలు లేనేలేవు
ధ్యానయోగసాధకులు, మరి జ్ఞానయోగసాధకులు
సకల మతాల మూలగ్రంథాలనూ,
ప్రపంచంలోని అన్య దేశీయుల యోగేశ్వరుల జీవితచరిత్రలనూ,
క్షుణ్ణంగా అధ్యయనం చేస్తారు .. చేస్తూనే, చేస్తూనే వుంటారు
తెలివైనవారు వేదాంత పఠనం జీవితాంతం చేస్తూ వుండరు
వారు, ఇక, తామే .. ధ్యానం ద్వారా
స్వయంగా సత్యద్రష్టలుగా కావడానికి వెంటనే ప్రయత్నిస్తారు
తెలివైనవారు వేదాంత పఠనం జీవితాంతం చేస్తూ వుండరు
వారు, ఇక, తామే .. ధ్యానం ద్వారా .. స్వయంగా సత్యద్రష్టలుగా కావడానికి
వెంటనే ప్రయత్నిస్తారు
* శుష్క వేదాంత చర్చలు మాని ధ్యానయోగుల దగ్గరి నుంచి నేర్చుకుందాం
* తెలివైనవారు వేదాంత పఠనం జీవితాంతం చేస్తూ వుండరు;
వారు, ఇంక, తామే . . ధ్యానం ద్వారా . .
స్వయంగా సత్యద్రష్టలుగా కావడానికి వెంటనే ప్రయత్నిస్తారు