మేనకా ప్రయోగం

 

 

“వశిష్టుడి” లాగా
‘బ్రహ్మర్షి’ గా
వెంటనే కావాలి ” అని 
“అవిరామ పరిశ్రమ” చేస్తున్నాడు విశ్వామిత్రుడు

అది గమనించి ఇంద్రుడు 
“ఆ పద్ధతి సరికాదు .. అది స్వయానికే హానికరం” 
అని తెలుసుకున్నవాడు కనుక
కనికరించి
మేనకను పంపి ఒకింత విరామం కలిగేటట్లు చేశాడు
కొన్ని నెలలు మేనకతో కలిసి విశ్రమించిన తరువాత
విశ్వామిత్రుడు తిరిగి సాధన చేపట్టి
అచిరకాలంలోనే “బ్రహ్మర్షి” కాగలిగాడు

మూర్ఖంగా ప్రవర్తించేవారికి సహాయపడేవాడే ఇంద్రుడు ;
కానీ, అతన్ని .. ఆ ఆస్ట్రల్ మాస్టర్‌ను ఎలా చిత్రీకరించారు !

“అతి ఆతురత” అన్నది ఎప్పుడూ హానికరం
నిదానంగా, నిలకడగా వుంటేనే దేనిలోనైనా గెలుపు
నిదానం ప్రధానం .. అతి సర్వత్ర వర్జియేత్