మెడిటేషన్ .. మైండ్‌ఫుల్‌నెస్
“మన శరీరం పై మనం పట్టు కలిగి ఉండటం ‘దమము’; మరి మనస్సుపై అదుపు కలిగి వుండటం ‘శమము’. శరీరం ఎక్కడ వుందో మనస్సు కూడా అక్కడే వుండాలి. అవి రెండూ పరస్పరం ఆధారపడి వుంటాయి. శరీరం మనస్సులు కలసి వుండటమే యోగం. సంగీతంతో శృతిలయలు ఎటువంటివో ఆధ్యాత్మికతలో దమము, శమము అటువంటివి.
“తన మనస్సు మీద తాను అదుపు సాధించిన వ్యక్తి ప్రపంచాన్నంతటినీ అదుపు చేయగల సామర్థ్యాన్ని కలిగి వుంటాడు. కనుక శరీరాన్ని అదుపు చేయకలిగిన సామర్థ్యం మనస్సును అదుపు చేయగలిగే సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది. అందుకే మనోనియంత్రణతో ప్రతి ఒక్కటీ సాధ్యమే. మనస్సులో తనువు ఇమిడి వుంది కానీ తనువులో మనస్సు లేదు కనుక సాంప్రదాయ యోగం శరీరంతో ప్రారంభమైతే పిరమిడ్ ధ్యానం మనస్సుతో మొదలవుతుంది.
“బాహ్యప్రపంచం నుంచి .. అంతర్ ప్రపంచానికి మార్గం శ్వాస. మనస్సు శూన్యమైనప్పుడు సూక్ష్మశరీరయానం చేసి మనం ‘మన శరీరాలం మాత్రమే కాదు; మనం ఈ ఒక్క జన్మ/జీవితంలో మాత్రమే లేము; మనం ఆత్మలం’ అని తెలుసుకుంటాం.
“ఇదంతా కూడా ఆత్మజ్ఞానం. ఇది అనంతమైనది, ఒక మహావృక్షం నుండి మనం మన చేతులు కొయ్యగలిగినన్ని ఆకులు కోస్తాం. ఆ కోసిన ఆకులు మనం సంపాదించిన జ్ఞానం అయితే ఆ మహావృక్షానికి గల మిగిలిన ఆకులు మనం పొందవలసిన జ్ఞానం. గురువును అనుసరించి ఆయన అంతటి వారుగా తయారవ్వాలి అనుకుంటే ఆయన చెప్పింది చెయ్యాలి. ఈ గురు శిష్య సంబంధాలకు మార్పా, మిలారెపాలు ఉత్తమ ఉదాహరణలు” అన్నారు.
“ధ్యానం అన్నది విలాసం కాదు! అది ఖచ్చితంగా ఒక మహా అవసరం. ఆ తరువాతే .. మాట్లాడటం, తినటం, నిద్రించటంవంటి ఇతర కార్యకలాపాలు వస్తాయి. జీవితంలో మొట్టమొదటి ప్రాధాన్యత ధ్యానం అయితే వారు బుద్ధుళ్ళు అవుతారు .. మరి చిట్టచివరి ప్రాధాన్యత ధ్యానం అయితే .. వారు ‘మొద్దులు’ అవుతారు. “ధ్యానం అంటే బుద్ధత్వం! ధ్యానం ఎంత ఎక్కువ చేయగలిగితే జీవితంలో అంత ఎక్కువ మార్పు వస్తుంది. ధ్యానం లేని వారు దరిద్రనారాయణులు అయితే ధ్యానం వున్నవారు లక్ష్మీనారాయణులుగా వెలుగుతూంటారు.
“భగవద్గీతలో ధ్యాన భంగిమ గురించి ‘సమఃకాయ శిరోగ్రీవం’ అని చెప్తారు. మార్మిక జ్ఞానం ప్రకారం ‘కాయ’ అంటే చేసే పనులు .. ‘గ్రీవ’ అంటే మాట్లాడే మాటలు .. ‘శిరో’ అంటే మదిలో మెదిలే ఆలోచనలు! ఇవి అన్ని ఒకటిగానే వుండాలి .. అదే ధ్యానం యొక్క అసలు అర్థం. అంటే త్రిక్రరణశుద్ధి.
“శక్తి బయటకు పోకుండా నిరోధించటానికి పాదాలు రెండూ పెనవేసి, వ్రేళ్ళు అన్నీ కలిపివేసి, కళ్ళు రెండూ మూసేసుకోవాలి. చర్మచక్షువు, మనోచక్షువు, దివ్యచక్షువు ఒక్కటి కావాలి. చర్మచక్షువుతో దర్శిస్తాం. మనోచక్షువుతో అనుభూతి చెందుతాం .. దివ్యచక్షువుతో జ్ఞానం పొందుతాం” – అని తెలిపారు.
“అప్పుడు గ్రేట్ గీజా పిరమిడ్ నిర్మాణంలో మనమందరం పనిచేశాం. అప్పుడు ఒక గొప్ప పిరమిడ్ యుగం; ఇప్పుడు మనం మన పిరమిడ్ యుగాన్ని తిరిగి పరిసాధిస్తున్నాం, పునర్ నిర్మిస్తున్నాం.
“బుద్ధపౌర్ణిమ గౌతమబుద్ధునికి మాత్రమే చెందింది కాదు. అది గతంలోని, వర్తమానంలోని, భవిష్యత్‌లోని, బుద్ధుళ్ళు అందరిదీ. ‘మార్పు శాశ్వతం’ అని అవగాహన చేసుకోవటమే బుద్ధత్వం. సత్యంవైపు నడవడటం మన విధి. సత్యమేవ జయతే. మనం దైవంతో ఉండటం అంటే సత్యంలో ఉన్నాం అని అర్థం.
“ఒకానొక బుద్ధుడు నిరంతర సృష్టికర్త! అతను ఎన్నడూ స్తబ్ధంగా ఉండలేడు. మన జీవితలక్ష్యం ఈ భూమిపైన ప్రతి వ్యక్తి కూడా శాకాహారిగా, బుద్ధునిగా మారేటట్లు చేయడం. మనకు కనీస అవసరాలైన తిండి, బట్ట, ఇల్లు వంటివి వున్నా, లేకపోయినా మనం సత్యం కొరకు పని చేస్తాం. ‘ఒకే గూటి పక్షులు ఒక్కచోటే చేరుతాయి’ అన్నట్లుగా ‘నా వద్దకు వచ్చే వా“మనం లక్ష్యాలను ఏర్పరచుకుని వాటికోసం కృషి చెయ్యాలి. లేనట్లయితే మన పురోగతి వేగంగా ఉండదు. ఇక్కడ పని పూర్తయితే మరో లోకానికి వెళ్ళి పనిచేస్తాం. ‘పని’ అన్నదానికి అంతం వుండదు. చైతన్యం ఎప్పుడూ విస్తరిస్తూనే వుంటుంది. చేతినిండా పని .. కంటి నిండా నిద్ర .. ఒంటి నిండా ఆరోగ్యం .. మనస్సు నిండా ఉల్లాసం .. ఆత్మ నిండా ఆనందం నింపుకోవడమే జీవితం” అని తెలియజేశారు.