మనస్సు స్థిమితమైతే సత్యం స్థితం
మనస్సుని నిలకడగా ఉంచితేనే సత్యం తెలుస్తుంది
శ్వాసే గురువు. మనస్సే శిష్యుడు. మనస్సుని శ్వాస మీద నిలిపినప్పుడే ఆత్మ సాక్షాత్కారమవుతుంది.
“లంఖణం పరమౌషధం” అని పెద్దలు చెప్పినదానికి అర్థం కేవలం ఉపవాసం ఒక్కటే కాదు. మాటల్లో మౌనం, మనస్సులో ధ్యానం కూడా లంఖణంలో భాగమే. అప్పుడే లంఖణం ఔషధ లక్షణాలు కలిగి వుంటుంది.
ప్రతి ఒక్కరూ శ్వాస మీద ధ్యాస వుంచడం ద్వారా ధ్యానాన్ని అలవరుచుకోవాలి. ధ్యానుల సమాజమే అన్ని సమస్యలకు పరిష్కారం.
విశ్వశక్తి ఆవాహన, నాడీమండల శుద్ధి, ఆత్మ దర్శనం … ఇవన్నీ ధ్యానం వల్లనే కలుగుతాయి. రాముడు, బుద్ధుడు, ఏసు మొదలైనవారిని స్మరించడం కన్నా వారి ఆచరణను మనం పాటిస్తే అసలైన ఫలితం లభిస్తుంది.