మనస్సు – బుద్ధి

 

 

కర్మానుసారిణీ బుద్ధిః.

నేను అంటే శరీరం – మనస్సు – బుద్ధి.

మొదటి సంగతి అందరికీ తెలుసు; ఇక రెండవది మనస్సు.

ప్రపంచం మనకు ఇచ్చిందే మనస్సు.

పుట్టినప్పటి నుంచి మనం పెరిగిన ఇంటి వాతావరణం.

తల్లిదండ్రులు అభిప్రాయాలు, ఇతర కుటుంబ పెద్దల సుద్దులు – ఇవి అన్నీ వెరసి మనస్సు ను మనకు ఇస్తుంది.

ఈ మనస్సు అన్నదే మానవ జీవితాలను పరిపరి దిశలలో లాగుతూంటుంది.

మనస్సుకు లోనైనవాడు సుఖదుఃఖాలను రాత్రి పగలు, ఎండ వాన లా ఎడతెరపి లేకుండా అనుభవిస్తూ వుంటాడు.

ఇకపోతే మూడవదే బుద్ధి.

ప్రపంచం మనకు ఇచ్చేది మనస్సు అయితే

మనకు మనం సువిచారణతో, సాధనతో ఇచ్చుకునేదే బుద్ధి.

అలాగే పూర్వజన్మలలోని అనంతకర్మల సారాంశమే బుద్ధి.

కనుకనే కర్మానుసారాణీ బుద్ధిః అన్నారు.

ప్రపంచ రీతులనూ, ఆధ్యాత్మిక సత్యాలనూ గమనించి అశుభ కర్మలను వదిలిపెట్టేసి,

శుభకర్మలనే చేబడితే క్రమక్రమంగా మనకు ఆ మూడవది, అదే బుద్ధి సంప్రాప్తిస్తుంది.

సత్య ప్రతిరూపమే బుద్ధి, ధర్మ ప్రతిరూపమే బుద్ధి.

జ్ఞాన ప్రతిరూపమే బుద్ధి, బుద్ధిలేని మానవుడు శాంతి లేని జీవుడు.

బుద్ధి వున్న జీవుడు ముక్త పురుషుడు.

ప్రపంచం బుద్ధిని ఇవ్వదు. గురువు బుద్ధి వున్నవాడే కానీ ఇతరులకు బుద్ధిని ఇవ్వజాలడు.

నిత్య జాగరూకతతో కూడిన మన శుభకర్మలే మనకు బుద్ధిని ప్రసాదిస్తాయి.

కనుక శుభకర్మలనే చేబడదాం.

బుద్ధినే సాధిద్దాం బుద్ధుళ్ళం అవుదాం.