మనం ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలం
మనం ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలం
ఆత్మశాస్త్రం, ఆత్మవత్ జీవితం .. ఇవే మన అధ్యయనా క్షేత్రాలు
మనం ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలం
జీవిత విషయాలన్నింటినీ సశాస్త్రీయ దృక్పథంతో పరీక్షించడం .. ఇదే మన నిజ ఆత్మప్రకృతి
మనం ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలం
ధ్యానజనితశక్తిలో సదా తేలియాడగలగడం .. ఇదే మన మౌలిక సామర్థ్యం
మనం ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలం
అనంత సూక్ష్మలోకాలలో సూక్ష్మశరీరయానాలు చేయబూనడం .. ఇదే ,మన మహా అభీష్టం
మనం ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలం
సకల పరిస్థితులలోనూ సహజ అవబోధ కలిగి వుండటం .. ఇదే మన నిగూఢ శక్తి
మనం ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలం
ప్రతి ఒక్కరికీ ఆత్మజ్ఞానప్రకాశాన్ని కలుగజేయడం .. ఇదే మన అఖండ ఆశయం
మనం ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలం
సమస్త సామాన్య ప్రజానీకానికి ధ్యాన – ఆరోగ్య-విధానాన్ని అందించడం .. ఇదే మన రోజువారీ కార్యక్రమం
మనం ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలం
అహింసాయుత, శాంతియుత, ఉత్తమ మానవాళి నిర్మాణం .. ఇదే మన మధుర స్వప్నం
మనం ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలం
2020 కల్లా ‘శాకాహార -ధర్మ జగత్’ సాధన .. ఇదే మన పరమ పవిత్ర లక్ష్యం
మనం ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలం
ప్రపంచ దేశాలన్నింటిలో ఆధ్యాత్మిక యోగుల ప్రభుత్వాల స్థాపన .. ఇదే మన దృఢ ప్రణాళిక
మనం ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలం
ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ స్పిరిచ్యువల్ సైంటిస్ట్స (IFSS) .. ఇదే మన మహా ఐక్యవేదిక