మనఃప్రలోభం – అంతరాత్మప్రలోభం

 

 

మనస్సు
ఏది చెప్పితే అది చేయడమే
“మనఃప్రలోభం” లో పడటం అంటే

ఇది అధముల లక్షణం
ఉత్తముడు ఎప్పుడూ అంతరాత్మ ప్రభోధాన్ని గుర్తిస్తాడు

‘అంతరాత్మ’ అంటే ‘పూర్ణాత్మ’,
“అంతరాత్మ ప్రభోధం” అంటే,
“పూర్ణాత్మతో సంబంధం నెలకొల్పుకోవడం” అన్నమాట
దాని ఆధారం గానే కోరికలను హద్దుల్లో
ఉంచుకుంటాడు ఉత్తముడు

మనఃప్రలోభాలకు ఎంతమాత్రమూ లొంగకుండా అంతరాత్మ ప్రభోధాన్ని
ఎప్పటికప్పుడు గమనించేవాడే నిత్యశ్రేయస్సును పొందుతాడు

త్రికరణ శుద్ధిఉన్నవాడికే అంతరాత్మ ప్రభోధం స్పష్టంగా తెలుస్తుంది.

అదే యోగి‘ కూడా అయితే ఇక పరమ గురువులతోఅంతరంగంలో ముఖాముఖి సంభాషణ చాలా సహజంగా వుంటుంది.