మాంసాహారం తినకూడదు
మాంసాహారం అనేది అసలు ఆహారమే కాదు. అది విష పదార్థం. శరీరాన్ని కృశింప చేస్తుంది. నశింప చేస్తుంది. రోగమయం చేస్తుంది.
కనుక మానవుని సరియైన ఆహారం శాకాహారమే. మానవుడు క్రూర జంతువుకాదు … జంతువులను చంపి కోసుకుని తినడానికి, మానవుడు శాకాహారి; కనుక చక్కటి స్వాదిష్ఠమైన శాకాహారమే, రుచికరమైన శాకాహారమే భుజించాలి.
నిజానికి పిరమిడ్ మాస్టర్లకే కాదు, పిరమిడ్ ధ్యానులకే కాదు, ధ్యానులు కానివారికీ మరి మాస్టర్స్ కానివారికీ, సమస్త మానవాళికి మౌలికమైన పాయింట్ -శాకాహారం.
శాకాహారం తీసుకునేవారికి ధ్యానం చాలా తొందరగా వస్తుంది. ధ్యానం మొదలుపెట్టిన వారికి వెంటనే శాకాహారం అభ్యాసం అవుతుంది ; మాంసాహారం వివర్జితమవుతుంది. మామూలు సైన్స్ – మెడికల్ సైన్స్ చెప్పినట్లు ‘మాంసకృత్తులు’ మాంసాహారం లోనే ఉంటాయంటే అది చాలా పొరపాటు. మాంసకృత్తులు శాకాహారంలోనే ఎక్కువ పాళ్ళలో వుంటాయి. కనుక ఎవ్వరూ కూడానూ మాంసాహారం తీసుకోకూడదు. అందరూ కూడా శాకాహారమే తీసుకోవాలి. శాకాహారంలో కూడానూ ఫ్రిజ్‌లో పెట్టిన రెండు రోజుల సాంబారు, మూడురోజుల కూర తీసుకోకూడదు. ఫ్రెష్‌గా చేసుకుని తినాలి ; వేడి వేడిగా తినాలి. పళ్ళు ఎక్కువుగా తీసుకోవాలి. నీరు చాలా ఎక్కువుగా త్రాగాలి. నీరు ఎంత ఎక్కువుగా త్రాగితే శరీరానికి అంత మంచిది.