మహాయోగిని జిల్లెళ్ళమూడి అమ్మ

   

నవ్య ఆంధ్రరాష్ట్రపు ఆధ్యాత్మిక మణులలో జిల్లెళ్ళమూడి అమ్మ అగ్రగణ్యులు.

అనేక జన్మల్లో అపారమైన యోగసాధన, ఆధ్యాత్మికత అన్నది వున్నప్పుడే ఆవిడ లాంటి జీవితం సాధ్యం.

అన్నీ తానై – తానే అన్నీ అయి విలసిల్లింది ఆవిడ.

దైనందిక జీవితంలో పరిపూర్ణ బ్రహ్మత్వానికి ఆ యోగిని అద్భుత దర్పణం.

పండితాసమదర్శినః :- అని భగవద్గీత అంటోంది – అంటే సిద్ధి పొందిన వారినీ, సిద్ధి పొందని వారినీ సమంగా చూసేదే యోగం.

యోగస్ధఃకురుకర్మాణిసంగంత్యక్త్వాఅని కూడా భగవద్గీత అంటోంది. అంటే:

అన్ని రకాల కర్మలనూ యోగ స్థితిలో వుండే చెయ్యి దేనికి అంటుకోకుండా అని అర్ధం.

జిల్లెళ్ళమూడి అమ్మ ఆ విధంగా మహా, మహా, యోగిని, 1970 లో ఆవిడ దర్శనం చేసుకోవడం నాకు జరిగింది.

పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీల మాస్టర్లందరికీ

ఆవిడ జీవితం ఆదర్శం ఆవిడ జ్ఞానం ఆదర్శం ఆవిడ ఆదర్శమే ఆదర్శం