“మహాశివరాత్రి అఖండ ధ్యానం”

 

పత్రీజీ సందేశం”

 

“ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలకు కావలసింది ‘పాహిమాం’, ‘పాహిమాం’ అంటూ అర్థించే దేవాలయాలు కావు. ధ్యానం చేసి తమలో ఉన్న ఆత్మశక్తిని వెలికి తీసుకుని తమను తామే ఉద్ధరించుకోగలిగే ధ్యాన పిరమిడ్‌లు కావాలి. ఇవి ఏ మతానికో, ఏ ఇజానికో సంబంధించినవి కావు. ఇవి కేవలం శక్తి క్షేత్రాలు మాత్రమే!

“ఒక ముక్కంటి మాత్రమే మరొక ముక్కంటిని గుర్తించగలడు. కనుక శివపుత్రులైన మనం ఇహలోకంలో ఉంటూనే పరలోకంలోని శివతత్వాన్ని పొందితీరాలి. నిరంతర ధ్యానజ్ఞాన సాధనతో శివతత్వాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోవాలి మరి శివుడు ఎంతటివాడో అంతటివాళ్ళం కావాలి.

“ఆ పరమ శివుడు చెప్పింది ధ్యానం, చేసింది ధ్యానం. ఆయన ధ్యానంలో నిష్ణాతుడై తన మూడవకంటిని తెరిపించుకుని దివ్యదర్శనాలన్నీ చేసాడు. పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ వారి ఏకైక లక్ష్యం మరి వారి జన్మకారణం .. ‘మనకూ శివుడికీ ఏ మాత్రం తేడా లేదు’ అంటూ ప్రతి ఒక్కరికీ చాటి చెప్పడమే మరి అది వాళ్ళకు స్వానుభవం అయ్యేంతవరకు వారిని ధ్యానం చేసేలా ప్రోత్సహించడమే!”