“మహా కరుణను ప్రపంచానికి చాటుదాం”

   

“ఈ ప్రపంచంలో జన్మ తీసుకుని .. అనేకానేక అనుభవాల ద్వారా జ్ఞానాన్ని పెంచుకుని .. మన ఆత్మలను ఇంకా ఉన్నత తలాలకు తీసుకుని వెళ్ళడానికే వచ్చిన మనమంతా కూడా ఈ సంసారంలోనే నిర్వాణం చెందాలి. ఈ సంసారాన్ని త్యాగం చేసి .. శిరోముండనం చేయించుకుని .. కాషాయ వస్త్రాలను ధరించి అడవులకో .. హిమాలయాలకో పోతే లాభం ఏమీ ఉండదు. ఇక్కడ ‘ఈ ప్రపంచం’ అనే సంసారంలో .. బాధ్యతాయుతమైన సభ్యులుగా ఉంటూనే .. ధ్యానం చేసి, సజ్జన సాంగత్యం చేసి, స్వాధ్యాయం చేసి ఏక కాలంలోనే అపారమైన అనుభవజ్ఞానాన్ని సంపాదించుకోవాలి. అటువంటి జ్ఞానంతో ఒకప్రక్క ఇక్కడి మన జీవితాలను పండించుకుంటూ మరొక ప్రక్క ఉన్నత లోకాలలోని మాస్టర్స్‌తో అనుసంధానం అవుతూ ఉండాలి.”

“ఇదే సరియైన జీవితం! ఇటువంటి సరియైన జీవితాన్ని జీవించాలంటే మనం చెయ్యాల్సింది ధ్యానం మరి మనలో పెంచుకోవలసింది కరుణ! మనతోపాటే ఈ సృష్టిలో ప్రాణం పోసుకున్న మన సోదర జంతువులను చంపి మన కడుపులు నింపుకోకూడదు. అది మహాపాపం! ఇటువంటి పాపకర్మల వల్లనే మనం రోగాలుపాలు అవుతూంటాం. కనుక ప్రతి ఒక్కరూ శాకాహారులుగా మారి మహాకరుణను ప్రపంచానికి చాటి చెప్పాలి” అని తెలియజేశారు.