మధ్యేమార్గం
“భగవద్గీత” మధ్యేమార్గాన్నే సదా బోధిస్తుంది:
“యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు,
యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖహాః”
మితం గా భోజనం
మితం గా విహారం
మితం గా విద్యుక్త ధర్మం
మితం గా నిద్ర
మితం గా ధ్యానం ఉండాలి.
ఎప్పుడూ మధ్యేమార్గమే అవలంబించాలి
మధ్యేమార్గం వల్లనే దుఃఖం పోతుంది
“అవబోధ” అంటే ధ్యానం; ధ్యానం కూడా గంటలు గంటలు చేయరాదు.
ధ్యానం కూడా యుక్తం గానే ఉండాలి; మితం గానే ఉండాలి;
ధ్యానం అన్నది మన ఇహలోక ధర్మాలకూ, నిత్యావసరాలకూ అడ్డు కాకూడదు
“అతి సర్వత్ర వర్జయేత్” ధ్యానంలో కూడా “అతి” పనికిరాదు.