మా గా మోహావేశం

 

 

కోరికలు వుండాలి;

కోరికలు ఎప్పుడూ సమంజసమే,

“కోరిక” అన్నది సుఖకారకం

“మోహం” అంటే, “అతి” . . “మితిమీరడం”

మితిమీరిన కోరికలనే “మోహం” అంటారు

మోహం అన్నది సర్వవేళలా గర్హించదగినది. .

“భజగోవిందం” లో శ్రీ ఆదిశంకరాచార్యులవారు అన్నారు

” మా గా మోహావేశం” అని అంటే . .

” ‘మోహం’ , ‘ఆవేశం’ అన్నది ఎప్పుడూ కూడవు నాయనా,” అని

“అతి సర్వత్ర వర్జయేత్” అని కదా లోకోక్తి

  • అతి అనేది ఏ విషయంలో వున్నా అది ప్రమాదకరం; అందువల్ల అన్ని విషయాలలోనూ అతి ని విడిచిపెట్టాలి; మితి నే చేపట్టాలి