కర్మ సిద్ధాంతం

 

“మనం ఇతరులకు ఏది చేస్తే .. అదే మనకు తిరిగివస్తుంది” అన్నది “కర్మసిద్ధాంతం”. అయితే కర్మ సిద్ధాంతాన్ని జాగ్రత్తగా అవగతం చేసుకోవాలి. మనం ఎవరికి మంచి చేసామో .. తిరిగి వాళ్ళదగ్గరి నుంచే మనకు మంచి రానక్కరలేదు! A’ అన్నవాడు C’ అన్నవాడికి మంచి చేస్తే .. దాని ఫలితాన్ని M’అన్నవాడు A’ అన్నవాడికి తిరిగి అందించవచ్చు.

     `A’ అన్నవాడు ‘D’ అన్నవాడికి చెడు చేస్తే .. దాని ఫలితాన్ని ఎవరో Y’ అన్నవాడు ‘A’ అన్నవాడికి తిరిగి అందించవచ్చు.

              ఈసృష్టిలోA=B=C=D=E=F=G=H=I=J=K=L=M=N=O=P=Q=R=S=T=U=V=W=X=Y=Zకాబట్టి “సుబ్బారావు” = “అప్పారావు” = “లక్ష్మమ్మ” = “సీత” = “శేఖర్” కాబట్టి .. “నేను ‘సుబ్బారావు’కు మంచి చేస్తే .. వాడు నన్ను ఎందుకు ముంచేశాడు?” అని బాధపడడం మూర్ఖత్వం. “నేను ‘సుబ్బారావు’కు మంచి చేస్తే .. వాడు నాకు ఎందుకు మంచి చేయలేకపోతున్నాడు?” అనుకోవడం అజ్ఞానం.

   కనుక నువ్వు ‘సుబ్బారావు’కు చేసిన మంచికి మరెవరో ‘అప్పారావు’ దగ్గర నుంచి దాని ప్రతిఫలాలు నీకు రావచ్చు. మరి నువ్వు చేసిన “చెడు” నీకు .. నువ్వు “మంచివాళ్ళు” అనుకునే వాళ్ళ దగ్గరినుంచి కూడా ప్రతిఫలాలు రావచ్చు కనుక .. “మంచి వాళ్ళు కదా .. చెడు ఎందుకు చేశారు?” అనుకోవడం కర్మసిద్ధాంతం తెలియనివాళ్ళు అజ్ఞానంతోనే చేసే కామెంట్స్.

   “చెడ్డవాళ్ళు కదా .. నాకు మంచి ఎందుకు చేశారు?” అనుకోవడం కూడా కర్మసిద్ధాంతం తెలియని వాళ్ళు అజ్ఞానంతో వేసే ఆశ్చర్యాత్మక ప్రశ్నలు! ఈ సృష్టిలో కర్మసిద్ధాంతం ప్రకారం “వ్యక్తులు” ఎక్కడా లేరు! కేవలం “మంచి-చెడు ఫలితాలు” మాత్రమే ఉన్నాయి .. కాబట్టి శాస్త్రీయంగా చూస్తే వ్యక్తుల గురించి మాట్లాడడం ఎవ్వరికీ తగదు!!

 

మౌనదీక్షలో ఉన్న పత్రీజీ .. వ్రాతపూర్వక సందేశం