జొరాస్టర్
జొరాస్ట్రియన్ మత స్థాపకుడైన
జొరాస్టర్
మహా ఋషి, మహా ద్రష్ట.
అయన చెప్పిన ఒక ఆణిముత్యం:
“మీకున్న దానితో (వస్తు సముదాయాలతో) ఎప్పుడు సంతృప్తులై వుండండి;
కానీ, ‘మీ’ తో అంటే, ‘మీ ఆత్మాభివృద్ధి’ తో మాత్రం ఎప్పుడూ సంతృప్తులు కాబోవద్దు.”
మరొక ముత్యం:
“మీ ‘ఆత్మ’ అనబడే ‘నదీ ప్రవాహాల’ ను శోధించండి;
మీ పరిణామక్రమాల గురించి ఆలోచించండి”
అంటే,
“మీ గతజన్మల గురించీ, పూర్ణాత్మ గురించీ, మీరు పరిశోధించండి” –
అన్నదే జొరాస్టర్ సందేశం.
- జొరాస్టర్ లాంటి పరమ ఆచార్యులందరూ తెలిపేవే పరమసత్యాలు; అవే పరమ ఆచారాలు
- ఆచార్యుడు చెప్పిందే ‘ఆచరణీయం’ ‘ఆచారం’.