జ్ఞానాన్ ముక్తిః

 

 

“ముక్తి” అంటే “విడుదల” దేని నుంచి విడుదల?

“తాపత్రయం” నుంచి

కపిల మహాముని చెప్పిన సాంఖ్య సూత్రం ఇది:

“త్రివిధ దుఃఖ అత్యంత నివృత్తిః అత్యంత పురుషార్ధః”

త్రివిధ దుఃఖాలే తాపత్రయాలు

“త్రివిధ దుఃఖాలు” అంటే “అధ్యాత్మిక”, ”ఆదిభౌతిక”, “ఆదిదైవిక”

తాపాలు

“అత్యంత దుఃఖ నివృత్తి” అంటే

“త్రివిధ దుఃఖాలలో అత్యంత ముఖ్యమైన ‘ ఆధ్యాత్మిక తాపాలు’ . . వాటి యొక్క నివృత్తి” అన్నమాట

ఈ మూడు రకాల దుఃఖాల నుంచి క్రమక్రమంగా

విడివడటమే “అత్యంత ముఖ్యమైన పురుషార్థం” –

అంటే “మోక్షం”, “ముక్తి” అన్నమాట

కపిల మహాముని ఇంకా ఇలా అన్నారు:

జ్ఞానాన్ ముక్తిః” అని అంటే, “జ్ఞానం వల్లనే ముక్తి వస్తుంది” అని

సంపూర్ణ ఆత్మజ్ఞానం ఉన్నవాడికి మరోజన్మ లేదు;

జన్మ ఉంటే తాపత్రయాలు ఉండితీరుతాయి.

 

  • ధ్యానసాధన వల్ల కూడగట్టుకునే ఆత్మజ్ఞానం వల్లనే ముక్తి సంప్రాప్తిస్తుంది