జిందాబాద్, జిందాబాద్

 

 

మనిషి మూడు దృక్కోణాలు కలిగిన వాడు

మనిషి మూడింటి కలయిక

మనిషి మూడింటి సమ్మేళనం

వీటినే మనసా, వాచా, కర్మణా అంటున్నాం

మనస్సు ఎప్పుడూ నిర్మలంగా వుండాలి

మనస్సు లో చెత్త ససేమిరా వుండరాదు

మనస్సు సదా శాస్త్రీయమైన ఆలోచనలతోనే విరాజిల్లాలి

మనస్సులో అశాస్త్రీయమైన ఆలోచనల చెత్త ససేమిరా వుండరాదు

మనస్సులో అత్యధికంగా వర్తమానపు అలోచనలే వుండాలి

అత్యధికంగా భూతకాలం, అత్యధికంగా భవిష్యత్తు అన్నవే

మనస్సును చెత్త చేస్తాయి

మనస్సులో చెత్త ససేమిరా వుండరాదు

మనస్సులో చెత్త వుండకుండా వుండాలంటే…

చేతినిండా పని పెట్టుకోవాలి

చేతినిండా సుకర్మ వుండాలి

మనస్సులో చెత్త వుండకుండా వుండాలంటే

నోటినిండా సువాణి వుండాలి

నోటిలో సదా సరస్వతి తాండవించాలి

జిందాబాద్, జిందాబాద్ … చేతినిండా పనికి జిందాబాద్

జిందాబాద్, జిందాబాద్ … నోటినిండా సువాణికి జిందాబాద్