జీవహింస

 

వేమన
మహాయోగి” మాత్రమే కాదు. .
పరమ సత్యాలను
నిర్మొహమాటంగా, పచ్చిగా, ఖచ్చితంగా, సులభశైలిలో చెప్పిన
పరమ ఆధ్యాత్మిక శాస్త్ర అధ్యాపకుడు” కూడా
ఖచ్చితంగా మాట్లాడని వాడు ఎప్పుడూ “అధ్యాపకుడు” కాలేడు
వేమన చెప్పినవన్నీ పచ్చి నిజాలే.

“జీవహింస” గురించి వేమన ఈ విధంగా చెప్పారు :

“పక్షిజాతిని బట్టి పరగ హింసలు బెట్టి
కుక్షి నిండ కూడు కూరుటకును
వండి తినెడివాడు వసుధ చండాలుడు
విశ్వదాభిరామ వినుర వేమ.”

“జీవి జీవిని జంపి జీవికి బెట్టంగ
జీవి తాను బలిసి చెలగుచుండు :
జీవహింసకులకు జిక్కునా మోక్షంబు ?
విశ్వదాభిరామ వినుర వేమ.”

జీవహింస ద్వారానే మానవుడు బంధాలలో చిక్కుకున్నాడు
జీవహింస మానివేసినప్పుడే
మోక్షయాత్ర ప్రారంభమవుతుంది
మోక్షాభిలాష ఉత్పన్నమైనప్పుడు . . ప్రప్రధమంగా . . హింసకు దూరం అవ్వాలి

* “పక్షిజాగి . . . . వండి తెనెడి వాడు . . . . వసుధ ఛండాలుడు”

* “జీవహింసకులకు చిక్కునా మోక్షము?”