గృహస్థాశ్రమం
“యస్మాత్ త్రయోస్యాశ్రమిణో
దానేన్నాననేవ చాన్వహమ్,
గృహస్థేనైవ ధార్యస్తే
తస్మాజ్జ్యేష్ఠాశ్రమో గృహే”
– మనుస్మృతి
“బ్రహ్మచారులు” , “వానప్రస్థులు” , సన్యాసులు” . .
అనే మూడు ఆశ్రమాల వారికీ
అన్నాదులనిచ్చి గృహస్థులే పోషిస్తున్నారు
సంపదలను సృష్టించేదీ గృహస్థులే ;
అందరికీ ఆశ్రయం ఇచ్చేదీ గృహస్థులే
కనుక,
గృహస్థాశ్రమమే ఎప్పుడూ పరిగ్రహణీయం
* ఉత్కృష్టమైన గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడే అజ్ఞానం నుంచి ముక్తి కూడా
సంపాదిస్తే .. అంతకు మించిన విజయం, సార్థకత లేనేలేదు