జ్ఞానమే మోక్షం

 

నోటిలోని మౌనం …

మనస్సులోని శూన్యం …

దాని పేరు ధ్యానం, దాని పేరు ధ్యానం.

మాటలోని ఎరుక …

మాటలోని సత్యం …

దాని పేరు జ్ఞానం, దాని పేరు జ్ఞానం.

ఆత్మలోని శాంతం …

ఆత్మలోని అభయం …

దానిపేరు మోక్షం, దాని పేరు మోక్షం.

చేతలోని న్యాయం

చేతలోని వినయం

దాని పేరు ధర్మం, దాని పేరు ధర్మం.

ధ్యానమే భోగం …

జ్ఞానమే మోక్షం …

సత్యమే దైవం

ఆంధ్రరాష్ట్రంలో అందరికీ ధ్యానం, ధ్యానం.

భారతదేశంలో అందరికీ జ్ఞానం, జ్ఞానం

భూమండలంలో అందరికీ మోక్షం, మోక్షం.