“గౌతమ బుద్ధుడు”

 

బుద్ధుదు చెప్పింది

ధమ్మపదంలో ఈ విధంగా నిక్షిప్తపరచబడింది:

“నిరయం పాప కమ్మినో

సగ్గం సుగతినో యన్తి, పరినిబ్బన్తి అనాసవా”

– “నిరయం పాప కర్మిణి

స్వర్గం సుగతయో యాన్తి, పరినిర్వాస్త్యనాస్రవావః”(సంస్కృతం)

“పాపపు పనులు చేసేవారు నరకాన్నీ,

పుణ్యాత్ములు స్వర్గాన్నీ పొందుతారు;

మనస్సులో మాలిన్యం లేని మహాత్ములు

పరినిర్వాణాన్ని పొందుతారు”

అలాగే,

“నాకన్నా ముందు ఎంతోమంది బుద్ధుళ్ళు వచ్చారు;

నాకన్నా తరువాత కూడా ఎంతోమంది బుద్ధుళ్ళు వస్తారు” –

అని కూడా అన్నాడు గౌతమబుద్ధుడు

 

  • “మీరు కూడా బుద్ధుళ్ళుగా కండి” ..
    అన్నదే బుద్ధుడు మనందరికీ ఇచ్చే సందేశం