గరళ కంఠుడు
ఈ ప్రపంచంలో అందరిదగ్గరా వున్న మిడిమిడి జ్ఞానం వల్ల
మనుష్యులు విషాన్ని సదా క్రక్కుతూ ఉంటారు
దుష్టభావనలను ఉత్పత్తి చేస్తూ ఉంటారు
మరి దీనినే ” నకారాత్మకత ” అంటాం
“నెగెటివిటీ” అన్నదే “విషం”
మనం దానిని మింగకుండా, మన ‘కంఠం’ లోనే పెట్టుకోవాలి
అంటే, “విశుద్ధ చక్రం” లోనే పెట్టుకుని శుద్ధి చేయాలి
అలా చేసేవాడే ” గరళ కంఠుడు”
గరళం = విషం
కంఠుడు= కంఠం లో ధరించిన వాడు
శ్రీ రత్నాకరం బాలరాజు గారు
“ధమ్మపదం” అన్న పుస్తకంలో చక్కగా చెప్పారు :
“చంద్రుణ్ణీ, హాలాహల విషాన్నీ, ఈశ్వరుడు గ్రహించినట్లు
పండితుడు అందరి గుణాలనూ శిరసా శ్లాఘించి
దోషాలను మటుకు కంఠమందే నిల్పుకుంటాడు
.. బహిర్గత మొనరింపడు” అని
* “గరళకంఠులు” కానిదే ఎవ్వరూ
ఎప్పటికీ ఆధ్యాత్మిక విజ్ఞానులుగా విరాజిల్లజాలరు