డూ ఆర్ డై
శ్రీ సదానంద యోగి . . కర్నూలు స్వామీజీ ..
ఎప్పుడూ నాతో అంటూండేవారు . .
“సుభాష్ , చేయి లేకపోతే చావు.” అని
” DO
OR
DIE.” అని
వేమన యోగి కూడా ఇదే పలుకు పలికాడు :
“పట్టు పట్టరాదు పట్టి విడువరాదు
పట్టు పట్టెనేని బిగియ పట్టవలయు
పట్టి విడుట కంటే, పడి చచ్చుటమేలు –
విశ్వదాభిరామ వినుర వేమ.”
బుద్ధుడు కూడా “ధమ్మపదం” లో ఇలానే అన్నాడు :
“కయిరా చే కయిరాథేనం, దళ్హమేనం పరక్కమే”
“కుర్యాచ్చేత్ కుర్వీతైతద్, దృఢమేతత్ పరాక్రమేత” -(సంస్కృతం)
“ఏ పని చేయాలన్నా దృఢమైన నిష్ఠతో, సామర్థ్యంతో చేయాలు”
* ఏ పనినైనా తలపెట్టేముందు “అది న్యాయమా? అన్యాయమా ? “,
“క్రమమా ? అక్రమమా ?” . .
“శుభమా ? ఆశుభమా ? ” అని మొదట బేరీజు వేసుకుని ఆ
తర్వాత న్యాయమైనదీ, సక్రమమైనదీ,
శుభమైనదీ అయితే దృఢచిత్తంతో దానిని చేసే తీరాలు; చావుకు
కూడా భయపడరాదు