“ధ్యానమే .. ధర్మం”

 

 

“ప్రతి ఒక్కరి జీవిత ధర్మం ధ్యానం చెయ్యడమే! మరి ఆ అభ్యాసం వారికి విద్యార్థి దశనుంచే ప్రారంభం కావాలి. ఎందుకంటే ఏదైనా సరే పట్టు పట్టి సాధించడానికి విద్యార్థి దశే సరియైన దశ! ఆ దశలోనే ఆత్మశాస్త్రాన్ని అవగతం చేసుకుంటే వారి భావి జీవితం సార్థకం అవుతుంది ఆత్మశాస్త్రం మనకు ‘నేను అంటే కేవలం గుండె, కాలేయం, కిడ్నీలు మరి రక్తమాంసాలతో మాత్రమే నిండిన శరీరం కాదు; నేను అంటే ఈ శరీరాన్ని ఆధారంగా చేసుకుని రకరకాల అనుభవజ్ఞానాలను పొందడానికి పై లోకాల నుంచి భూలోకానికి విచ్చేసిన ఒకానొక ఆత్మను’ అన్న సంగతి తెలియజేస్తుంది.

“ఇలా అనుభవజ్ఞానాలను పొందే క్రమంలో మనం రకరకాల కర్మలు చేస్తాం. ఆ యా కర్మలను బట్టి కర్మ ఫలితాలను పొందుతూ ఉంటాం. విత్తనాన్ని బట్టే చెట్టు ఉన్నట్లు మంచికర్మలు చేస్తే మంచి ఫలితాలు; చెడు కర్మలు చేస్తే చెడు ఫలితాలు వస్తాయి! ధ్యానం చేస్తూంటే .. మన అంతరంగలోకి మనం ప్రయాణం చేస్తూంటే ఈ ఆత్మ సత్యాలన్నీ అవగతం అవుతూంటాయి” అని తెలియజేశారు.