ధ్యానమహావిజ్ఞానం .. ఐన్‌స్టీన్ సాపేక్షతా సిద్ధాంతం
“E = mc2 సాపేక్షతా సిద్ధాంతం”
ప్రపంచ ప్రఖ్యాత భౌతికవిజ్ఞాన శాస్త్రజ్ఞులు
మరి
నోబెల్ బహుమతి గ్రహీత సర్ ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ మహనీయులు
ప్రపంచమానవాళికి అందించిన గొప్ప వైజ్ఞానిక సూత్రం !
“E = mc2 సాపేక్షతా సిద్ధాంతం” మనకు
“నిర్దిష్టమైన కాంతివేగం c – ( velocity of light .. c = 3×10 to the power of 5 km/sec) లో
ప్రయాణించబడిన ఒకానొక ద్రవ్యరాశి m(mass) ..
శక్తి E-(Energy) గా రూపాంతరం చెందుతుంది “
అన్న శక్తి వినిమయ మహాసూత్రాన్ని తెలియజేస్తోంది.
ప్రపంచ వైజ్ఞానిక రంగాన్నే మేలుమలుపు త్రిప్పిన ఈ మహాసూత్రాన్ని ఆధారంగా చేసుకుని
అణుశక్తి మొదలుకొని ఎలక్ట్రానిక్ సూపర్ కంప్యూటర్లు, గ్రహాంతర పరిశోధనల వరకూ
ఆధునిక ప్రపంచంలో జరిగిన ఆవిష్కారాలు ఎన్నో, ఎన్నెన్నో ..
అదే స్ఫూర్తితో ..
“E = mc2 సాపేక్షతా సిద్ధాంతాన్ని “శాస్త్రీయ ఆధ్యాత్మకత” కు కూడా అన్వయించుకుంటే ..
“కాంతిసదృశమైన స్పష్టత c – clairty ను కలిగిన .. సజ్జనసాంగత్యం – c1 + స్వాధ్యాయం – c2 లతో ..
కూడిన ధ్యానం m- meditation
శక్తిప్రదాయకమైన దివ్యజ్ఞానప్రకాశం E – Enlightenment కు దారితీస్తుంది”
E = mc2
దివ్యజ్ఞానప్రకాశం ( E) = ధ్యానం ( m ) x స్వాధ్యాయంతో స్పష్టత (c1) x సజ్జన సాంగత్యంతో స్పష్టత (c2 )
E – Enlightenment = దివ్యజ్ఞానప్రకాశం m- meditation =ధ్యానం c – clairty = స్పష్టత
/\
స్వాధ్యాయంతో స్పష్టత (c1) సజ్జన సాంగత్యంతో స్పష్టత (c2 )
భౌతికవిజ్ఞానశాస్త్రవేత్త .. సాపేక్షతా సిద్ధాంత కర్త సర్ ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ మహాశయులకు శతకోటి పిరమిడ్ ధ్యానవందనాలు