ధ్యానం వల్లనే జ్ఞానం జ్ఞానం వల్లనే ముక్తి
“ధ్యానం” అంటే “శ్వాస మీద ధ్యాస”
శ్వాస మీద ధ్యాస ద్వారానే చిత్తవృత్తి నిరోధం.
చిత్తవృత్తి నిరోధం ద్వారానే విశ్వశక్తి ఆవాహనం.
విశ్వశక్తి ఆవాహనం ద్వారానే నాడీమండల శుద్ధి.
నాడీమండల శుద్ధి ద్వారానే దివ్యచక్షువు ఉత్తేజితం.
ఇదంతా వెరసి ధ్యానం.
ఇకపోతే “జ్ఞానం”,
“జ్ఞానం” అంటే “మాట మీద ధ్యాస”.
“మాట మీద ధ్యాస” ద్వారానే “మాట మీద పట్టు” ;
“మాట మీద ధ్యాస” ద్వారానే “మాట శుద్ధి”.
“ధ్యానం వల్లనే జ్ఞానం” –
అంటే “శ్వాస మీద ధ్యాస” ద్వారానే
మరి “మాట మీద ధ్యాస” అన్నది సంభవం.
“నాడీమండల శుద్ధి” ద్వారానే మరి “వాక్ శుద్ధి” సంభవం.
ఇకపోతే “ముక్తి ” –
“ముక్తి” అంటే “ఆత్మ సిద్ధి”.
“జ్ఞానాన్ ముక్తిః”, అన్నది సాంఖ్యం ;
అంటే “మాట శుద్ధి వల్లనే ఆత్మసిద్ధి” అన్నమాట.
“ఆత్మ సిద్ధి” అంటే “ఆత్మ యొక్క లబ్ధి” , “ఆత్మ యొక్క ప్రాప్తి”.
మాట శుద్ధి ఉండాలిరో, అన్నలారా, ఆత్మ సిద్ధి కలగాలిరో…