ధ్యానం వలన లాభాలు
ధ్యానం ద్వారా
మనకు ఆరు విధాల లాభాలు చేకూరుతాయి:
అవి,
1) శారీరక ధారుడ్యం
2) మానసిక ప్రశాంతి
3) బుద్ధి సునిశిత
4) ఆర్ధిక సంక్షేమం
5) సుమిత్ర ప్రాప్తి
6) ఆధ్యాత్మిక విజ్ఞానం
“ధ్యానయోగం” అన్నది తెలియని వారికి
ఆధ్యాత్మిక సత్యాలు దృగ్గోచరం కావడం అన్నది అసంభవం;
కనుక, వారు అనేక విధాల ప్రమత్తులై వుంటారు
పర్యవసానం –
ఏ విధమైన స్వస్థతా వాస్తవానికి వారికి వుండదు.
- ధ్యానులు కాని వారికి శారీరక దుర్బలత, మానసిక అశాంతి, ఆధ్యాత్మిక అజ్ఞానం అన్నవి తప్పవు
- ధ్యానులు కానివరికి ‘సుమిత్ర శూన్యత’, అంటే ‘సంఘంలో మంచి మిత్రులు లేకపోవడం’అన్నది వుంటుంది
- ధ్యానులు కానివారికి “ఆధ్యాత్మిక అజ్ఞానం”, అంటే “మనం ఎవరమో, ఎందుకు జీవిస్తున్నామో అన్నది బొత్తిగా తెలియకపోవడం” , అన్నది తప్పదు