ధ్యానం – మోక్షానందం
“తస్య యోనిం పరిపశ్యంతి ధీరాస్తస్మిన్హ తస్థుర్ భువనాని విశ్వా”
– యజుర్వేదం (31-19)
తస్య | = | పరబ్రహ్మణో |
యోనిం | = | సత్యధర్మానుష్టానం వేద విజ్ఞానమేవ ప్రాప్తికారణం |
ధీరా | = | ధ్యానవంత |
తస్మిన్ భువనాని విశ్వా | = | సర్వాణి సర్వేలోకాస్తస్థుడు స్థితం చక్రిరేహేతి నిశ్చయార్థే |
తస్మిన్నేవ | = | పరమే పురుషే |
ధీరా | = | జ్ఞానినో మనుష్యా మోక్షానందం ప్రాప్య |
తస్థుః | = | స్థిరా భవంతే త్యర్థ |
-స్వామి దయానంద వ్యాఖ్య
- “విద్వాంసులు ఆ పరబ్రహ్మప్రాప్తికి కారణాలైన సత్యాచరణనూ, సత్యవిద్యనూ, ధ్యానంతో తెలుసుకుని పరమేశ్వరుని పొందుతారు; ఆయన లోనే జ్ఞానులు సత్యనిశ్చయంతో మోక్ష సుఖాన్ని పొంది, జనన-మరణ రూపాల రాకపోకల నుంచి విడిపోయి ఆనందంలో మునిగి వుంటారు”
-స్వామి దయానంద – పండిత గోపదేవ్ ఆధారంగా