ధ్యాన జ్యోతి

 

 

ధ్యాన జ్యోతి ద్వారానే ఆత్మ జ్యోతి వెలిగేది

ఆత్మ జ్యోతి ద్వారానే జ్ఞాన జ్యోతి వెలగగలిగేది

జ్ఞాన జ్యోతి ద్వారానే మరి ధర్మ జ్యోతి వెలిగేది

ధర్మ జ్యోతి ద్వారానే సుకర్మ జ్యోతి వెలిగేది

సుకర్మ జ్యోతి ద్వారానే ఆరోగ్య ఆనంద జ్యోతులు వెలిగేది..

సుకర్మ జ్యోతి ద్వారానే నిత్య ప్రగతి జ్యోతి వెలిగేది

అన్నింటికి మూలం ధ్యానం..

కనుకనే, ముందుగా ధ్యాన జ్యోతి ని వెలిగించాలి

ధ్యాన జ్యోతి ని ప్రతిరోజూ వెలిగిస్తూనే వుండాలి

ఆనాపానసతి తోనే ప్రారంభమవుతుంది ధ్యాన జ్యోతి

అది విపస్సన లో జ్వాజల్యమానంగా విజృంభిస్తుంది

అన్నింటికీ మూలం ధ్యానం

జీవితంలో ఉల్లాసానికీ, ఉత్సాహానికీ మూలం ధ్యానం

సకలప్రాణికోటి సౌభ్రాతృత్వానికి మూలం ధ్యానం

సకల మతాల సామరస్యానికి మూలం ధ్యానం

విద్యా వినయవంతులు కావడానికి మూలం ధ్యానం

కనుక, వెలిగిద్దాం ధ్యాన జ్యోతి ని..

సదా వెలిగిస్తూనే వుందాం ధ్యాన జ్యోతి ని –

సదా మనలో, మరి అందరిలో..

దేవాలయాల్లో విగ్రహం ముందర హారతి కర్పూరాన్ని వెలగిస్తాం

అంటే అర్థం ఏమిటి?

ఈ దేహం అనే దేవాలయంలో మనస్సు అనే కర్పూరాన్నికరిగించి,

బుద్ధి అనే జ్యోతి ని వెలిగించాలి, ఆ యొక్క వెలుతురులోనే అతను తనను తాను

తెలుసుకునేది. దేహంలో వున్నఅందకారాన్ని తొలగించాలి. దేహంలో వున్న అందకారం అంటే.. దేహంలో వున్న మలినం అంటే..పూర్వ జన్మ కృత పాపం ఫలితం.

ప్రతి ఇంటిలోనూ వెలగాలి ధ్యాన జ్యోతి

ప్రతి వ్యక్తిలోనూ వెలగాలి ధ్యాన జ్యోతి..

నిత్య రోగి అయినవాడు నిత్య భోగి గా విలసిల్లాలంటే వెలగాలి ధ్యాన జ్యోతి..