ధ్యాన వరం

 

ధ్యానం అన్నది మానవుని పునీతుణ్ణి చేసే వున్న ఒక్కగానొక్క ప్రక్రియ; ధ్యానం మానవుణ్ణి దివ్యమనస్కుడి గా రూపొందిస్తుంది.

ధ్యానంవలన ఆధ్యాత్మిక సంపద పెరుగుతుంది. ధ్యానం వలన సుఖం, ఆనందం, బ్రహ్మానందం కలుగుతాయి.

ధ్యానం ఏమీ లేకున్నా అన్నీ ఉన్నట్లే.. ధ్యాని నిత్య సుఖి..ధ్యానం అన్నది పూర్ణ కైవల్య సాధనా మార్గం. ధ్యానం చేయటం అంటే పరమాత్మగా, పరమాత్మ లో నిమగ్నుడై వుండటం అని భావం.

మనమందరం విశ్వశక్తి స్వరూపులమే; ధ్యానం వలన మనలోని విశ్వశక్తి ప్రచండంగా విజృంభిస్తుంది. కనుక, ధ్యానమన్నది ఒక్కగానొక్క అద్భుతవరం అనడం లో అతిశయోక్తి లేదు.

ధ్యానమే అందం – జ్ఞానమే చందం

ధ్యానమే జయం – జ్ఞానమ విజయం