ధ్యాన శంఖారావం

 

భాషా ప్రాతిపదిక మీద అవతరించిన ప్రప్రథమ భారత రాష్ట్రం – ఆంధ్ర రాష్ట్రం – ఆంధ్రప్రదేశ్

అది 1956 వ సంవత్సరం, శ్రీ పొట్టి శ్రీరాములు గారి కృషి విశేషం.

ఆంధ్రులకు ఆంధ్రరాష్ట్ర అవతరణ ప్రథమ ఘట్టం అయితే, ఇప్పుడు చారిత్రాత్మకమైన,

ఆధ్యాత్మిక పూరితమైన రెండవ ఘట్టం లో మనం ఉన్నాం.

మరి, ప్రపంచం చరిత్రలోనే అపూర్వ ఘట్టంగా

ధ్యాన ప్రాతిపదికమీద ఆత్మజ్ఞాన ప్రాతిపదిక మీద ఆంధ్రరాష్ట్రమన్నది భారత రాష్ట్రాలలోనే గాక, యావత్ ప్రపంచంలో ప్రప్రథమ ధ్యాన రాష్ట్రం కావాలన్నదే యావదాంధ్రుల ప్రస్తుత మనోభీష్టం.

సకల ఆంధ్రుల ఈ నూతన మనోభీష్టానికి స్ఫూర్తిని కల్పిస్తున్నవారు ఆంధ్రరాష్ట్ర పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ మాస్టర్లు. పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ ధ్యానులందరి యొక్క ఏకైక ధ్యేయం

ఇప్పుడు ఆంధ్రరాష్ట్రం ధ్యానాంధ్ర రాష్ట్రం కావాలని. మరి,

ఆంధ్రప్రదేశ్ ధ్యానాంద్రప్రదేశ్ గా వెంటనే అవతరించాలని.

ఇదంతా ఖచ్చితంగా 2004 సంవత్సరం కల్లా పరిసమాప్తమవ్వాలి.

డిసెంబర్ 2004 సంవత్సరం కల్లా ప్రతి ఆంధ్రుడు ఒక యోగి అయి తీరాలి.

భగవద్గీతలోని యోగీ భవ అర్జున

-అన్న శ్రీకృష్ణ సందేశం ఇప్పుడు ఆంధ్రులందరికీ తక్షణ కర్తవ్యం.

ఆంధ్రులందరూ యోగులయ్యే తీరాలి.

ఆంధ్రులందరూ ఋషులూ, ఆత్మద్రష్టలుగా అయ్యే తీరాలి.

ఆంధ్రులందరూ బ్రహ్మజ్ఞానంతో బ్రహ్మర్షులు గా విరాజిల్లి తీరాలి.

2004 సంవత్సరం నాటికి

ఆంధ్రప్రదేశ్ ను ధ్యానాంధ్రప్రదేశ్ గా అవతరింపజేయడానికి కావల్సిన శక్తి సామర్థ్యాలూ, తెలివితేటలూ, దీక్షా తత్పరతలూ

అన్నీ పుష్కలంగా కలిగి ఉన్నారు – ఇప్పటికే వేలకొద్దీ ఉన్న పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీల మాస్టర్లు.

డిసెంబర్ 2004 సంవత్సరం కల్లా ధ్యానాంధ్రప్రదేశ్ అవతరణ తప్పనిసరిగా వాస్తవం అయి తీరుతుంది.

యద్భావం తద్భవతి అన్నారు కదా, మన భావనలే మన వాస్తవాలు గా మారుతాయి.

నేటి ప్రణాళికలే రేపటి పరిణామాలు. వర్తమాన కర్మలే భవిష్యత్తు కర్మఫలాలు.

జై ఆంధ్రప్రదేశ్.

జై ధ్యానాంధ్రప్రదేశ్.