ధ్యాన సాధన
“ధ్యాన సాధన మనల్ని అన్నింటిలోనూ నిష్ణాతుల్ని చేస్తుంది. అన్నింటిలోనూ ‘పర్‌ఫెక్ట్’ గా చేస్తుంది. ‘ఇంపర్ఫెక్షన్’ అంటే ఏమిటి? శరీరానికి రోగం ‘ఇంపర్ఫెక్షన్’. మనస్సుకు అశాంతి ‘ఇంపర్ఫెక్షన్’. బుద్ధికి మాంద్యం ‘ఇంపర్ఫెక్షన్’. ఆత్మకు తన శక్తిని తాను తెలుసుకోకపోవడం ‘ఇంపర్ఫెక్షన్’. కనుక ధ్యానం వలన ‘ఇంపర్ఫెక్షన్’ పోయి, ‘పర్‌ఫెక్షన్’ వస్తుంది. ధ్యానం యొక్క శక్తిని తెలుసుకోవాలంటే ముందు నిద్ర యొక్క శక్తి తెలుసుకోవాలి.”