ధ్యాన జీవితం

 

ఆత్మ జ్ఞానం అనేది ధ్యానం, సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం అనే మూడు విధాలుగా సమకూర్చుకోవాలి; ఈ జన్మను ఆఖరు జన్మగా చేసుకోవాలి – అంటే తప్పవు మరి అవి.

ప్రాపంచికంగా మనం ఏం సంపాదించినా, ఏవి సాధించినా అవన్నీ అశాశ్వతమే.

అందుకే శాశ్వతమైన దాని కోసం తపన పడాలి. శాశ్వతమైన దానిని పోరాడి సాధించాలి.

ఈ జన్మను ఆఖరు జన్మగా మలచుకోవాలి.

లేదంటే మళ్ళీ పుట్టడం – మళ్ళీ చావడం – ఇలా పుడుతూ, ఛస్తూ కొన్ని వందల జన్మలను ఇప్పటికే వ్యర్ధం చేసుకున్నాం

ఇంకా ఎన్ని జన్మలు ఇలా ఉంటాం ? ? ఇక చాలు.

ఈ జన్మనే ఆఖరు జన్మగా చేసుకుందాం …

ఈ విధమైన ధృడ సంకల్పంతో ఈ క్షణం నుంచి ధ్యాన జీవితాన్ని జీవిద్దాం.