ధీరులు

 

 

“సీరా యుంజతి కవయో యుగా వితన్వతే పృథక్,

ధీరా దేవేషూ సుమ్నయా”

= యజుర్వేదం (12-67)

కవయః = విద్వాంసః, క్రాంత దర్శనాః క్రాంత ప్రజ్ఞా వాః
ధీరాః = ధ్యానవంతో యోగినః;
పృథక్ = విభాగేన ;
సీరాః = యోగాభ్యాసోపాననార్థం నాడీర్ యుంజంతిఅర్థాత్ తాను పరమాత్మానా జ్ఞాతు మభ్యస్యన్తి తథ్;
యుగా = యుగాని యోగయుక్తాని కర్మణి;
వితన్వతే = విస్తారయంతియ ఏవం కుర్వంతి తే;
దేవేషూ = విద్వత్సు యోగిషూ;
సుమ్నయా = సుఖేనైన స్థిత్వా పరమానందం;
యుంజంతి = ప్రాప్నువంతే త్యర్థః

= దయానంద వ్యాఖ్య

” విద్వాంసులూ, యోగులూ, ధ్యానులూ అయినవారు

భిన్న భిన్న నాడులను ఉపాసనాయోగం కోసం ఉపయోగిస్తారు;

పరమాత్మ, సాక్షాత్కారం కోసం ఉపాసనాయోగాన్ని అభ్యసిస్తారు ;

యోగాన్ని నిరంతరం విస్తరింపచేస్తారు; యోగాభ్యాసులతో

ప్రశంసలు పొంది పరమానందభరితులౌతారు”

= పండిత గోపదేవ్ ఆధారంగా

  • యజుర్వేదం ప్రకారం – యోగాభ్యాసం స్వంతంగా చేస్తూ, అందరిచేతా చేయిస్తూ ఉండే వారే నిజమైన ధీరులు