“ధ్యాన – శాకాహార అమెరికా”

 

 

“పత్రీజీ సందేశం”

“అరచేతిలో వైకుంఠం” అంటూ పత్రీజీ వారికి “శరీరం” .. “మనస్సు” .. “ఆత్మ”ల యొక్క ప్రాముఖ్యతను వారికి వివరిస్తూ ..”అయిదు వ్రేళ్ళ ఆనందమయ సూత్రాన్ని” బోధించారు: చిటికెన వ్రేళు .. శరీరం ఉంగరపు వ్రేలు .. మనస్సు మధ్యవ్రేలు .. బుద్ధి చూపుడు వ్రేలు .. జీవాత్మ బొటన వ్రేలు .. సర్వాత్మ “మనస్సు శరీరానికి తల్లిలాంటింది. ఒకానొక తల్లి తన బిడ్డను ప్రేమగా, అప్యాయంగా చూసుకున్నట్లు ప్రతి ఒక్కరూ తమ మనస్సుతో తమ శరీరాన్ని చూసుకోవాలి. అది చురుకుగా ఉండగలిగేట్లు తగినంత మోతాదులో శాస్త్రీయమైన రీతిలో వ్యాయామం చేయాలి కానీ శరీరాన్ని అతిగా ఎప్పుడు కష్టపెట్టరాదు! “శరీరాన్ని వీలైనంత స్థిమితంగా ఉండనిస్తే .. మనస్సు తనను తాను స్థిమితపరచుకుంటుంది. కాబట్టి స్థిర సుఖ ఆసనంలో శరీరాన్ని స్థిమితపరచి వీలైనంత ఎక్కువగా ధ్యానానికి ఉపక్రమించాలి. “పుట్టుకతో మనం మన శరీరాన్ని తల్లితండ్రుల దగ్గరి నుంచి తెచ్చుకుంటాం. సమాజంలో మరి చుట్టుప్రక్కల వారితో కలిసి పెరుగుతూ మనస్సును తెచ్చుకుంటాం. “మంచి – చెడు ల విచక్షణా జ్ఞానాన్ని ఉపయోగిస్తూ మనం చేస్తూన్న కర్మల ద్వారా ‘బుద్ధి’ని తెచ్చుకుంటాం. వీటన్నింటినీ ఒక సాక్షిలా గమనిస్తూ మన ఆత్మను గుర్తిస్తాం. వీటన్నింటికీ ఆధారమైన సర్వాత్మను నిరంతర ధ్యాన సాధన ద్వారా దర్శించుకుంటాం! అనంతరం కార్యక్రమానికి హాజరయిన వారంతా ధ్యాన సాధనా క్రమంలో తమకు వచ్చే వివిధ సందేహాలకు పత్రీజీ నుంచి స్పష్టతతో కూడిన సమాధానాలను పొందారు.